Sunday, December 22, 2024

విద్యార్థినులు అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • ర్యాగింగ్, ఈవీటీజింగ్‌పై షీటీమ్ సిబ్బంది అవగాహన

దుబ్బాక: విద్యార్థినులు అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, హుస్నాబాద్ సిఐ కిరణ్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ శ్వేత అదేశానుసారం హుస్నాబాద్‌లోని పోతారం ఎస్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపులే బిసి వె ల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థినులకు ర్యాగింగ్, పోక్సో చట్టం, బా ల్య వివాహాల , ఇవిటీజీంగ్, పోక్సో, షీటీమ్స్, యాంటి హ్యూమెన్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షీటీం సి బ్బంది కంప్లైట్ క్యూఆర్ కోడ్ గుర్తించి తెలియజేస్తూ ఆన్‌లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన ఫిర్యాదు చేసేందుకు ఉపయోపపడుతుందన్నారు. ఈ స్కానర్ కలిగి ఉండాలని తమ ఫోన్‌తో పోస్టర్‌పై స్కాన్ కోడ్‌ను స్కాన్ చే యడం ద్వారా లింక్ వస్తుంది ఫిర్యాదు చేసే విధానం గురించి అవగాహన కల్పించారు.

మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేదింపులకు గురియ్యే వా రు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మహిళల వివరాలు గోప్య ం గా ఉంచుతామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేసి త క్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. ఎవరైనా వేధించిన, రో డ్డు పై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశ పూర్వకంగా వెంబడించి న వెంటనే 100 లేదా షీటీం వాట్సాప్ నంబర్ 8712667343, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేసన్ సిద్దిపేట 8712667435 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఫిర్యాదు చేసినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శైలజ, ఆద్యాపకులు హుస్నాబాద్ ఎస్‌ఐ మహేశ్, హుస్నాబాద్ షీటీమ్ సిబ్బంది మల్లేశం, ఎఎస్‌ఐ కానిస్టేబుళ్లు దుద్యానాయక్, మహేశ్, మహిళా కానిస్టేబుల్ స్వప్న, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News