Wednesday, January 22, 2025

ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిలు ఆందోళన

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. ఆర్ విఎం మెడికల్ కాలేజీ విద్యార్థినులు అధ్యాపకులు వేధిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్ విఎం మెడికల్ కళాశాలలో తమను అధ్యాపకులు దుర్భాషలాడుతూ, బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినిలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేస్తున్నారని, ఓవర్ డ్యూటీలు వేస్తున్నారని, సెలవు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమకు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ అధ్యాపకులను తొలగించి వేరే అధ్యాపకులను నియమించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News