Wednesday, January 22, 2025

ఆమెకు వృద్ధులే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

వృద్ధులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న కిలాడి లేడీని రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ వివాహం కాగా భర్త మరణించాడు. వృద్ధలతో పరిచయం చేసుకొని ఇంట్లో పనిమనిషి లాగా చేరుతుంది. కొన్ని రోజుల తర్వాత వృద్ధులకు పెట్టే అన్నప్రసాదాలలో మత్తు మందు కలిపి ఇస్తుంది.

వారు నిద్రలోకి వెళ్లగానే ఒంటిపై ఉన్న బంగారు నగలు, ఇంట్లో ఉన్న నగదు, విలువైన ఆభరణలు దోచుకొని వెళుతుంది. ఇలా ఆమె పై తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో 18 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 18న ఆమె ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆమె దగ్గర 273.8 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News