Sunday, January 19, 2025

లక్ష కోట్ల మోసం… మహిళా టైకూన్‌కు మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

హనోయ్: వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన, వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ట్రూంగ్ మై లాన్ దాదాపు లక్ష కోట్లకు (12.5 బిలియన్ డాలర్లు) సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసింది. ట్రూంగ్ మైలాన్‌కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంకులో దాదాపు 90 శాతం వాటా ఉంది.

కొన్నేళ్లు ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగ్ (వియత్నాం కరెన్సీ) లు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్ డాలర్లకు పైమాటే. 201922 మధ్య ఆమె డ్రైవర్ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదును లాన్ నివాసానికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా, అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News