Monday, January 20, 2025

ఫెమినా మిస్ ఇండియా ఫైనల్‌కు తెలంగాణ అమ్మాయి

- Advertisement -
- Advertisement -

జాతీయ స్థాయి అందా ల పోటీలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే అవకాశం నాకు లభించింది. ఇది ఇతర అమ్మాయిలు, యువతను శక్తివంతం చేస్తుందని భావిస్తున్నా’నని ఫెమినా మిస్ ఇండియా ఫైనల్‌కు ఎంపికైన ప్రకృతి కంబం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఆమె మీడియా ఇంటరాక్షన్ సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే మిస్ ఇండియా తెలంగాణ 2024ను ప్రకృతి కంబం టైటిల్‌ను కైవసం చేసుకున్నది. ఈమె తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ వైవిధ్యాన్ని మోస్తూ ప్రారంభ విద్యను బెంగళూరులో పూర్తి చేసింది. తన వృత్తి కార్యకలాపాలను మెరుగుపర్చుకునేందుకు హైదరాబాద్‌లో నివాసముంటోంది. త్వరలో జరిగే ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ౩౦ మంది ఎంపికవగా, తెలంగాణ నుంచి తాను ఎంపికైనట్లు ప్రకృతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News