Friday, December 20, 2024

కడపలో తమ రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన ఫెనెస్టా..

- Advertisement -
- Advertisement -

కడప: దేశంలో అతిపెద్ద కిటికీలు, తలుపులు బ్రాండ్‌, తమ విభాగంలో మార్కెట్‌ అగ్రగామిగా వెలుగొందుతున్న ఫెనెస్టా తమ రిటైల్‌ కార్యక్రమాలను మరో నూతన షో రూమ్‌ ప్రారంభించడం ద్వారా విస్తరించింది. ఈ నూతన షోరూమ్‌, జీ ఇంటీరియర్స్‌, 36/263–31, మొదటి అంతస్థు, ఓల్డ్‌ బై పాస్‌ రోడ్‌, నవత ట్రాన్స్‌పోర్ట్‌ ఎదురుగా, రెడ్డి కాలనీ, కడప– 516002 వద్ద ఉంది. ఇది అత్యుత్తమ యుపీవీసీ కిటికీలు, తలుపులతో పాటుగా అల్యూమినియం కిటికీలు, తలుపులను, ఇంటర్నల్‌, డిజైనర్‌ డోర్లను తీసుకువస్తుంది.

ఈ నూతన షోరూమ్‌ ప్రారంభం సందర్భంగా ఫెనెస్టా బిజినెస్‌ హెడ్‌ సాకేత్‌ జైన్‌ మాట్లాడుతూ ‘‘కడపలో మా తాజా షోరూమ్‌ను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఫెనెస్టా వద్ద మేము కట్టుబడి ఉన్నాము. ఈ నూతన షోరూమ్‌ ప్రారంభంతో, కడప మరియు చుట్టుపక్కల ప్రాంతాలలోని వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాలను అందించనున్నాము. మా అత్యాధునిక షోరూమ్‌లలో విస్తృత శ్రేణి వినూత్నమైన, ఆధునిక డిజైన్లను ప్రదర్శిస్తుంటాము. ఇవి విస్తృత శ్రేణిలో వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చనున్నాయి’’ అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకూ జరిగిన విస్తరణ పట్ల సంతోషంగా ఉన్నాము. రాబోయే సంవత్సరాలలో మరింత వేగవంతమైన వృద్ధిని కొనసాగించనున్నాము. విస్తృతశ్రేణి మార్కెటింగ్‌ వ్యూహం, వైవిధ్యమైన ఉత్పత్తులు, వేగవంతమైన రిటైల్‌ విస్తరణ మా లక్ష్యం చేరుకోవడంలో తోడ్పడనున్నాయి’’ అని అన్నారు. కడపలోని ఫెనెస్టా షోరూమ్‌లో విస్తృతశ్రేణిలో కిటికీలు, తలుపులు, విభిన్న రకాల డిజైన్లు, రంగులు లభిస్తాయి. ఈ షోరూమ్‌ ప్రారంభంతో ఫెనెస్టా ఇప్పుడు దేశవ్యాప్తంగా 350 ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News