Monday, January 13, 2025

సెలెరీ ఫెన్నెల్ టీ తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..

- Advertisement -
- Advertisement -

నిద్రపోవడానికి ముందు మనం కచ్చితంగా ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే మనం దాదాపు రాత్రి సమయంలో 7 నుండి 8 గంటల వరకు ఏమి తినకుండా ఉంటాము. ఈ సమయంలో మనం తిన్న ఆహారం నుంచి శరీరం కావాల్సిన పోషకాలను తీసుకొని బలంగా దృఢంగా చేస్తుంది. అంతేకాకుండా.. రోజంతా చురుగ్గా ఉండడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ మీరు రాత్రి సమయంలో అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే, అది శరీరానికి, జీవక్రియకు, పేగులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమయంలో రాత్రి నిద్రపోయే ముందు సెలెరి, ఫెన్నెల్ టీ ని తీసుకుంటే అది జీవక్రియను పెంచుతుంది. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. రాత్రి సమయంలో దీని తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.

సహజ శరీరాన్ని శాంత పరిచే లక్షణాలు సెలెరి, ఫెన్నెల్ లో కలిగి ఉంటాయి. సామాన్యంగా సెలెరి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫెన్నెల్ తేలికపాట ఉపాసమన ప్రభావాలకు ఉపయోగిస్తారు. టీ లో ఈ రెండు మూలికల మిశ్రమాన్ని త్రాగితే నాడీ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా.. ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో రాత్రి మొత్తం హ్యాపీగా నిద్రపోవచ్చు. ఉదయం లేచిన తర్వాతే కొత్త అనుభూతిని పొందవచ్చు.

ఎవరైనా రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ఎదుర్కొనే సమస్య సాధారణమే. ఇలా కాకూడదు అంటే సెలరీ, ఫెన్నెల్ మూలికలతో తయారుచేసిన టీని తాగితే సరిపోతుంది. ఇది కడుపులో ఉన్న గ్యాస్ ని బయటకు పంపడానికి ఎంతో సహాయపడతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఈ టీని తాగడం వల్ల పొట్టకు ఉపశమనం కలుగుతుంది.

పడుకునే ముందు సెలెరి, ఫెన్నెల్ టీ తాగడం వల్ల జీవక్రియ ఎంతో మెరుగుపడుతుంది. సెలెరిలో ధర్మోజనిక్ లక్షణాలు కలిగి ఉండడం వలన ఇది మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. తద్వారా జీవక్రియ వేగవంతం చేస్తుంది. ఇది నిద్రలో కూడా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News