Monday, December 23, 2024

ఐపిఎల్ 2023 ఫాస్టెస్ట్ డెలివరీ.. ఫెర్గూసన్ @154.1

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 16వ సీజన్‌లో కోల్ కతా నైట్‌రైడర్స్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఐపిఎల్ 2023 ఫాస్టెస్ట్ డెలివరీని ఆదివారం నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఫెర్గూసన్ గంటకు 154.1కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన ఫెర్గూసన్ రెండో బంతిని బౌలింగ్ చేశాడు. ఔట్‌సైడ్ ఆవల వేసిన ఫెర్గూసన్ ఫాస్టెస్ట్ ఫుల్‌డెలివరీని ఎదుర్కొన్న గిల్ డీప్ పాయింట్ మీదుగా బంతిని తరలించి సింగిల్ రన్‌తో సరిపెట్టుకున్నాడు.

ఈ ఓవర్లో రెండో బంతి 154.1, మూడో బంతి 150.5, నాలుగో బంతిని 151.4కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. రెండోబంతిని వేగంతో బౌలింగ్ చేయగా సాహా ఎక్స్‌ట్రా కవర్‌మీదుగా బౌండరికీ తరలించాడు. దీంతో మూడో బంతిని డాట్‌బాల్‌గా వేసి లోకీ బదులిచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన లోకీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. కాగా గతేడాది జరిగిన ఐపిఎల్ 2022లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు కూడా ఫెర్గూసన్ పేరిట ఉండటం విశేషం. సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన లోకీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157.3కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News