Sunday, January 19, 2025

13 మంది జల సమాధి

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై తీరంలో బుధవా రం ఫెర్రీ మునిగి 13మంది మృతి చెందారు. 70 మందిని పోలీసులు ర క్షించారు. మరికొందరి ఆచూకీ ల భ్యం కాలేదని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలియజేశారు. ‘గే ట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫె ర్రీ…80 మంది పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దానిని ఢీకొట్టింది. దాంతో ఫె ర్రీ మునిగిపోయింది. వెంటనే స్పం దించిన రెస్కూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి.

11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు , నాలుగు హెలికాప్టర్లు కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నా యి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్ , మత్సకారులు సహాయక చర్యల్లో పాల్గొని 70 మందిని కాపాడారు. ప్ర మాద సమయంలో ఫెర్రీలో దాదాపు 80 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన స్పీడ్ బోటు, నేవీ లేదా కోస్ట్‌గార్డుకు చెందినదిగా భావిస్తున్నారు. నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి ఫె ర్రీని ఢీకొన్నట్టు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News