Monday, December 23, 2024

రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భూపాలపల్లిలో గల రామ్ సాయి ఎరువుల విత్తనాలు దుకాణంను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాల నిర్వహణను, రిజిస్టర్‌లను, స్టాక్ వివరాలు కలెక్టర్ పరిశీలించారు. వానాకాలం 2023 పంటకు జిల్లాలో అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే స్టాక్ పెట్టుకొని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటుందని, మన జిల్లాలో సైతం ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయశాఖ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటు ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News