Sunday, December 22, 2024

రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఉప్పల రామ్మూర్తి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ జనరల్ మర్చంట్ ఎరువల దుకాణాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం 2023 సీజన్ గాను జిల్లాలోని రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయుట కొరకు దుకాణ దారుల వద్ద గల యూరియా డిఏపి కాంప్లెక్స్ చెరువుల లభ్యత స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేయడం జరిగింది.

ఈ పాస్ మిషన్ యందు గల స్టాకును పరిశీలించడం జరిగింది. జిల్లాలో వానాకాలం 2023 పంటలకు సరిపడా ఎరువుల అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నా యక్‌ను కలెక్టర్ సూచించారు. ఎరువుల దుకాణాల్లో పిఏసిఎస్ లలో ఎరువుల లభ్యత మార్కెఫెడ్ గోడౌన్లలో ఎరువుల నిల్వలు జిల్లాకు కెటాయించిన ఎరువుల గురించి కలెక్టర్ వ్యవసాయ అధికారి రామారావును అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తమ ఆధార్ కార్డును పిఓఎస్ మిషన్లో నమోదు చేసుకుని ఎరువులు కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు.

వానాకాలం 2023 సీజన్‌గాను జులై మాసం వరకు 26,922 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 31,323 సరఫరా అవ్వగా 2796 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేయగా ప్రస్తుతం 28,527 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.వానాకాలం సీజన్‌కు కావలసిన సరిపడా ఎరువులు విడతల వారీగా సి అండ్ డిఏ ప్లాన్ ద్వారా జిల్లాకు సరఫరా చేయడం జరుగుతుందని జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లుగా కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News