Sunday, January 19, 2025

కూపర్ సర్జికల్‌తో ఫెర్టీ9 భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:దేశంలో సంతానోత్పత్తి సంరక్షణ సేవలను అందించటంలో ప్రముఖ సంస్థగా వెలుగొందుతున్న ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, గర్భధారణ విజయాల రేటును పెంచడానికి వైద్య పరికరాల తయారీలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కూపర్ సర్జికల్ ఫెర్టిలిటీ సొల్యూషన్స్‌తో పరివర్తన భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం భారతదేశంలో మొట్టమొదటి ఇంప్రూవింగ్ అవుట్‌కమ్ పార్ట్‌నర్‌షిప్ (IOP) గా నిలుస్తుంది. సంతానోత్పత్తి పరిష్కారాలను కోరుకునే జంటల కోసం చికిత్స పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్టాలలో ఏడు అధునాతన సౌకర్యాలను ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తోంది. IVF, ICSI, IUI, మరిన్నింటితో సహా సమగ్రమైన సంతానోత్పత్తి సేవలను ఇది అందిస్తోంది. భారతదేశం యొక్క సంతానోత్పత్తి చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులకు కూపర్‌సర్జికల్‌తో ఈ భాగస్వామ్యం హామీ ఇస్తుంది. అదే సమయంలో విజయాల రేటును పెంచడం, లోపాలను తగ్గించడం, అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ నైపుణ్యం ద్వారా మరిన్ని ప్రత్యక్ష జననాలను ప్రోత్సహిస్తుంది.

శ్రేష్ఠత పట్ల ఫెర్టీ9 యొక్క అంకితం దాని ప్రపంచ-స్థాయి ఎంబ్రియాలజీ ల్యాబ్ ద్వారా ప్రకాశిస్తుంది. ఈ అత్యాధునిక సదుపాయం, గంటకు 60-90 గాలి మార్పులతో IS07 శుభ్రమైన గది ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది, ఇది ఎంబ్రియో కల్చర్, నిల్వ కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ల్యాబ్, ప్రతి ప్రక్రియలో ఖచ్చితత్వం, సంరక్షణను నిర్ధారిస్తూ, విస్తృతమైన అనుభవంతో అత్యున్నత అర్హత కలిగిన అంతర్గత ఎంబ్రియోలాజిస్ట్స్ తో కూడిన సిబ్బందిని కలిగి వుంది. అత్యాధునిక సాంకేతికత, RI విట్‌నెస్ సిస్టమ్ ద్వారా మెరుగుపరచబడిన ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు పరీక్ష, కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలతో, ఫెర్టీ9 సంరక్షణ, భద్రత, నైతిక పద్ధతుల యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంది.

విజయవంతమైన గర్భ ధారణల యొక్క నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌తో, బ్లాస్టోసిస్ట్ దశకు విస్తరించిన ఎంబ్రియో కల్చర్ మరియు బహుళ గర్భధారణ ప్రమాదాలను తగ్గించడానికి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (SET) నిబద్ధతతో సహా, ఫెర్టి9 సంతానోత్పత్తి పరిష్కారాలను కోరుకునే వారికి ఆశాదీపంగా నిలుస్తుంది. అందువల్ల, ఈ కార్యక్రమంలో భాగంగా, అంతర్జాతీయ ప్రాజెక్టులు, పెద్ద సంస్థలతో విస్తృతమైన అనుభవం ఉన్న ప్రముఖ IVF కన్సల్టెంట్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెర్రెరో ఈ సదుపాయాన్ని సమీక్షించడానికి మరియు స్థిరమైన మెరుగుదలలను నిర్ధారించడానికి సలహాదారుగా కొనసాగడానికి ఆహ్వానించబడ్డారు. రాచెల్ చిన్, MSS, క్లినికల్ అప్లికేషన్ మేనేజర్ APAC, PhD, ఎంబ్రియాలజీ డైరెక్టర్, కూపర్ సర్జికల్‌- స్టీవెన్ ఫ్లెమింగ్ కూడా ఫెర్టీ9 కేంద్రాలను సందర్శించినప్పుడు సమగ్ర నాణ్యత అంచనాను నిర్వహించారు.

కూపర్ సర్జికల్ లో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ & క్లినికల్ సపోర్ట్ – గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ డా. ఇంగే ఎర్రెబో అగెర్‌హోమ్ మాట్లాడుతూ.. “ఫెర్టీ9 ఫెర్టిలిటీ క్లినిక్‌లతో ఇంప్రూవింగ్ అవుట్‌కమ్ పార్ట్‌నర్‌షిప్ ప్రారంభించడం పట్ల నేను చాలా సంతోషంగా వున్నాను. ఫెర్టీ9 ఫెర్టిలిటీ క్లినిక్‌లు తమ రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడానికి నిరంతర ప్రతిబింబం, మెరుగుదలకు అంకితమైన గ్రూప్ గా వెలుగొందుతుంది. కూపర్ సర్జికల్ రాబోయే తరాలకు సంతానోత్పత్తి సంరక్షణను మార్చడానికి సాధ్యమయ్యే వాటిని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంది. మా నిపుణుల బృందం యొక్క విస్తృతమైన నైపుణ్యం, విశ్లేషణాత్మక దృష్టి, తాజా ఉత్తమ అభ్యాసాల జ్ఞానం, శాస్త్రీయ పురోగతిని పొందడం ద్వారా, ప్రస్తుత పద్ధతులను సమీక్షించడానికి, దాని క్లినిక్‌ల ప్రక్రియలు, వైద్యపరమైన సామర్థ్యాలు, ఫలితాలు. మెరుగుపరచడంలో సహాయపడే ప్రాంతాలను గుర్తించడానికి, ఆప్టిమైజ్ చేయడానికి మేము ఫెర్టీ9 ఫెర్టిలిటీ క్లినిక్‌లతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం భారతదేశంలో ప్రపంచ-స్థాయి సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడంలో ఫెర్టీ9 యొక్క తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది, మాతృత్వం దిశగా కృషి చేస్తోన్న లెక్కలేనన్ని జంటలకు తమ ఆశలు, కలలను సాకారం చేయటం లో సహాయం చేస్తోంది.

ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ సీఈఓ,యు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వినేష్ గాధియా మాట్లాడుతూ.. ” ఫెర్టీ9 యొక్క ల్యాబ్‌లను ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులచే సమీక్షించబడటానికి తగిన అవకాశాలను IOP ప్రోగ్రామ్ తెరుస్తుంది తద్వారా శ్రేష్ఠత పరంగా నూతన ప్రమాణాలను ఏర్పరుస్తుంది. మరింత ముందుకు వెళ్తే , ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటితో పోల్చతగిన రీతిలో మా క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ (CPR)ని పెంచడానికి, కూపర్ సర్జికల్ తో ఈ భాగస్వామ్యం ప్రపంచ-స్థాయి సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడంలో, పేరెంట్‌హుడ్ మార్గంలో లెక్కలేనన్ని జంటల కలలను సాకారం చేయడంలో మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

కూపర్ సర్జికల్ ఫెర్టిలిటీ సొల్యూషన్స్‌తో ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ యొక్క మార్గదర్శక భాగస్వామ్యం భారతదేశపు సంతానోత్పత్తి రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి నైపుణ్యం, నైతిక అభ్యాసాల పట్ల అచంచలమైన అంకితభావాన్ని ఏకం చేయడం ద్వారా, ఫెర్టీ9 గర్భధారణ ఫలితాలను మెరుగుపరచడంలో, సానుకూల ప్రభావం చూపడంలో మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఫెర్టీ9, కూపర్ సర్జికల్ కలిసి ఈ పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, భారతదేశంలో సంతానోత్పత్తి పరిష్కారాల భవిష్యత్తు గతంలో కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది, ఇది కొత్త ప్రారంభాలకు వాగ్దానం చేస్తుంది, మాతృత్వ పు కలలను సాకారం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News