Monday, December 23, 2024

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారనగర్ కాలనీలో శ్రీతుల్జాభవాని అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహరం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల పండుగలకు ప్రాధన్యత ఇస్తూ ప్రతి ఒక్కరి సంతోషం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. అం దుకోసం ప్రతి పండుగకు నిధులు ఇస్తున్నారని అందులో భాగంగానే బో నాల పండుగ సందర్భంగా ప్రతి గుడికి నిధులు కేటాయించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కృషి చేశాడన్నారు. ప్రతి ఒక్కరు బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అన్ని దేవాలయల వద్ద అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లే కుండా చూడాలని ఆలయల కమిటీలకు ఆయన సూచించారు. అదే విధంగా పండుగలు ప్రశాంత వాతావరనంలో జరుపుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రవీందర్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, కృష్ణ యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, నటరాజు, శ్రీనివాస్, నిర్వహకులు బండి సత్తయ్య, బండి పాండు, బాల్‌రాజ్, బండి ప్రసాద్, బండి గోపి, హరి, సురేందర్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News