Wednesday, January 22, 2025

మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పేవే పండుగలు : తలసాని

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ ః తెలంగాణాలో పండుగలను గొప్ప జరుపుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్థక,మత్స,పాడి పరిశ్రమల అభివృద్ధి,సినిమాటోగ్రఫి శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమీషనరేట్ కార్యాలయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్,స్థానిక కార్పోరేటర్ డా.సురేఖా ఓం ప్రకాష్ భీష్వాలతో కలసి ప్రభుత్వం అందించిన చెక్కులను దాదాపు 178 దేవాలయాలకు అంధజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని ,ఉత్సవాలకు ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని వివరించారు.అం

దులో భాగంగానే నేడు మలక్‌పేట,గోషామహాల్ నియోజకవర్గాల్లోని గుడులకు దాదాపు రూ.59.96 లక్షల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు.ఈపండుగను దేవాదాయ శాఖలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేటు దేవాలయాలకు కూడా అందిస్తున్నామని వెల్లడించారు.బోనాల పండుగకు ఈసంవత్సరం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని పేర్కోన్నారు.26 దేవాలయాలకు రాష్ట్రప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించన్నుట్లు చెప్పారు.17 తేదీ నుండి జరిగే ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే ఊరేగింపుకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ప్రజలు సంతోషంగా ఉండాలి,పండుగలను గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వ ఉద్ధేశమని ఈసందర్భంగా మంత్రి స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో దేవాదాయశాఖ కమీషనర్ అనీల్‌కుమార్,డిప్యూటి కమీషనర్ రామకృష్ణ,బేగంబజార్ కార్పోరేటర్ శంకర్‌యాదవ్, జాంబాగ్ కార్పోరేటర్ రాకేష్‌జైశ్వాల్,మాజీ ఎమ్మెల్యే ప్రేం సింగ్ రాధోడ్,బీఆర్‌ఎస్ ఇంచార్జ్ నందకిషోర్ వ్యాస్,బీజేపినేత పాండూయాదవ్,మాజీ కార్పోరేట్ మమతాగుప్తా, పరమశ్వేరిసింగ్, సంతోష్‌గుప్తా, ఆనంద్‌గౌడ్,గడ్డం శ్రీనివాస్‌యాదవ్,ముఖేష్‌సింగ్,ఆర్‌వి మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News