Wednesday, January 22, 2025

సంస్కృతి సంప్రదాయాలను చాటేవి పండుగలే: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Festivals showcase cultural traditions: Minister Talasani

హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని, స్వరాష్ట్రంలో వీటిని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొగల్ పురా పోలీస్ స్టేషన్ సమీపంలో గల సుల్తాన్ షాహీ జగదాంబ అమ్మవారి ఆలయం వద్ద బోనాల ఉత్సవాల సంబంధించి ప్రభుత్వం తరుపున ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ పరిధిలోని ఆలయాలతో పాటు సౌత్ జోన్ పరిధిలో గల సుమారు 345 దేవాలయాలకు రూ.1.86 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు జరగనున్నాయని భక్తులు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా రూ. 100 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, సీవరేజ్ వంటి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా గతంలో ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో విరాళాలు సేకరించే వారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు 3500 కు పైగా దేవాలయాలకు రూ.15 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పండుగలను ప్రజలు అంతా కలిసి మెలసి సంతోషంగా, గొప్పగా జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతల కు విఘాతం కల్పించాలని ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం లాల్ దర్వాజ లోని సింహవాహిని దేవాలయ అభివృద్ధి, నిర్మాణ పనులను ప్రభుత్వం త్వరలో చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిపి సాయి చైతన్య, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, సభ్యులు మధుసూదన్ యాదవ్, గాజుల అంజయ్య, మధుసూదన్ గౌడ్, మహేష్ యాదవ్, హన్స్ రాజ్, శంకర్ యాదవ్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News