Wednesday, January 22, 2025

ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గురుకులం ఆల్ ఇండియా 1600 లోపు ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ పోస్టర్‌ను సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈవ్వర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూన్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ‘1 వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 లోపు ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్’ ను నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించిన పోస్టర్ ను సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూన్స్ సొసైటీ కార్యదర్శి రోనాల్ రోస్ , ఇతర తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు పాల్గొన్నారు. చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న చెస్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News