ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు
మన తెలంగాణ / హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండంతో విద్యుత్ సంబంధిత సమస్యలపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి దేవుల పల్లి భాకర్‌రావు ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీల్డ్ ఇంజనీర్లు హెడ్‌క్వార్టర్స్‌లో అత్యవసర పరిస్ధితుల్లో హజరుకావాలని ఆదేశించారు. ఏవైన అత్యవసర పరిస్థితులు, బ్రేక్‌డౌన్స్‌కు హజరయ్యేందుకు అన్ని ఈహెచ్‌టి (ఎక్స్‌ట్రా హై టెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్స్) సబ్‌స్టేషన్లలోసెంట్రల్ బ్రేక్‌డౌన్ గ్యాంగ్‌లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. అన్ని ఉత్పాదక కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలతో సాధారణంగా పని చేస్తున్నాయని తెలిపారు.కృష్ణా బేసిన్‌లో ఇన్‌ఫ్లోను బట్టి హైడల్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎటువంటి సంఘటనలనైనా ఎదుర్కొంనేందుకు విద్యుత్ యంత్రాంగం సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాపంగా విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్‌సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంజనీర్లు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులను యుద్దప్రాతిపదిక చేపట్టాలని ఆదేశించారు.