Sunday, December 22, 2024

రోహిత్ లో ఆ కోణం చూశాను: భారత ఫీల్డింగ్ కోచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడంటే చాలు సిక్స్‌ల మోత మోగిస్తాడు. బంతి లెగ్ సైడ్ పడిందంటే చాలు బంతి బౌండరీ లైన్ దాటాల్సిందే. అతడు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 264 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 31 సెంచరీలు, టెస్టుల్లో 12 శతకాలు, టి20ల్లో ఐదు శతకాలు బాదాడు. టెస్టు, వన్డే, టి20ల్లో కలిపి అంతర్జాతీయంగా 19 వేలకు పైగా పరుగులు చేశాడు. భారత్ కు టి20 వరల్డ్ కప్ అందించాడు. అతడు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అందరితో కలిసి మెలిసి ఉంటాడు. అందరితో సరదాగా ఉంటూ నవ్వులు చిందిస్తాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ గురించి భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ మాట్లాడారు. రోహిత్ లాంటి మంచి మనుషులను తన జీవితంలో చాలా తక్కువ మందిని చూశానని, రోహిత్ శర్మ జట్టులోని ప్రతి ఒక్కరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటాడని కొనియాడారు.

సహచర ఆటగాళ్లతో ఫన్నీగా ఉండడంతో పాటు మైదానంలో ఆటను ఎంజాయ్ చేస్తాడని ప్రశంసించారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ గ్రౌండ్‌లో మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడని తెలియజేశారు. రోహిత్ కెప్టెన్సీ గురించి చర్చించాల్సిన అవసరం లేదని, అతడు టి20 వరల్డ్ కప్, ఐదు ఐపిఎల్ ట్రోపీలు సాధించారని మెచ్చుకున్నారు. అతడు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకరని, రోహిత్‌తో పని చేస్తున్నప్పుడు అతడిలో మంచి నాయకత్వ లక్షణాలు కనిపించాయని, అలాంటి వ్యక్తి అరదుగా కనిపిస్తాడని దిలీప్ తెలిపారు. డెక్కన్ ఛార్జర్స్‌లో ఉన్నప్పుడు రోహిత్‌తో తనకు అంత అనుబంధం లేదని, కానీ టీమిండియాకు అతడు కెప్టెన్ అయిన తరువాత మా ఇద్దరు మధ్య మంచి అనుబంధం ఏర్పడిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News