Tuesday, January 21, 2025

భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం తరలింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాటతో ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విమానం బయలు దేరిన కొద్ది సేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాట జరిగింది. దీంతో తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. దీన్ని విమాన సిబ్బంది గమనించి వెంటనే విమానాన్ని దారి మళ్లించడానికి నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఏవియేషన్ సెక్యూరిటీ తెలిపింది. వీరి గొడవకు కారణం మాత్రం తెలియరాలేదు.

మొదట భర్త (జర్మన్) ప్రవర్తన గురించి భార్య (థాయ్‌లాండ్) పైలట్‌కు ఫిర్యాదు చేసింది. భర్త తనను బెదిరిస్తున్నాడని సిబ్బంది జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ గొడవ గురించి పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేశారు. తరువత ఢిల్లీలో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. మొదట విమానాన్ని దగ్గర్లోని పాకిస్థాన్ విమానాశ్రయానికి తరలించాలని అనుకున్నారు. కానీ గుర్తు తెలియకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత విమానాన్ని సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో దించారు. కీచులాటకు దిగిన భార్యాభర్తలను ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News