Friday, January 10, 2025

అదరగొట్టిన బ్రెజిల్.. ప్రిక్వార్టర్ ఫైనల్లో కొరియాపై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రశ్రేణి జట్టు బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆసియా ఆశాకిరణం దక్షిణ కొరియాతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. బ్రెజిల్ ధాటికి కొరియా ఎదురు నిలువలేక పోయింది. అసాధారణ ఆటతో చెలరేగి పోయిన బ్రెజిల్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఆట ప్రారంభం నుంచే బ్రెజిల్ దూకుడును ప్రదర్శించింది. ఏడో నిమిషంలోనే విని జూనియర్ బ్రెజిల్‌కు తొలి గోల్ అందించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కంగుతినిపిస్తూ విని ఈ గోల్ నమోదు చేశాడు.

మరోవైపు గాయంతో గ్రూప్ దశ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాడు నేమర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. 13వ నిమిషంలో అద్భుత గోల్‌ను సాధించాడు. ఇక బ్రెజిల్ ధాటికి కొరియా పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు 29వ నిమిషంలో రిచర్లీసన్, 36వ నిమిషంలో లుకాస్ గోల్స్ చేశారు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి బ్రెజిల్ 40 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా బ్రెజిల్ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈసారి బ్రెజిల్‌కు ఒక్క గోల్ కూడా లభించలేదు. కానీ 76వ నిమిషంలో పైక్ సియుంగ్ హో కొరియాకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత ఆటలో మరో గోల్ నమోదు కాలేదు. ఇక చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బ్రెజిల్ 41తో గెలిచి ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News