Monday, January 20, 2025

ఫుట్‌బాల్‌లో భారత్‌కు 99వ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 99వ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఫిఫా గురువారం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్, శాఫ్ ఛాంపియన్‌షిప్‌లలో భారత్ ట్రోఫీలను సాధించిన విషయం తెలిసిందే. కాగా, ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకునేందుకు ఈ విజయాలు దోహదం చేశాయి.

టాప్100లో చోటు దక్కడంతో 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. ఇదిలావుంటే ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మాజీ ఛాంపియ న్ ఫ్రాన్స్ రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది. బ్రెజిల్ మూడో, ఇంగ్లండ్ నాలుగో, బెల్జియం ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. క్రొయేషియా, నెదర్లాం డ్స్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లు కూడా టాప్10 ర్యాంకింగ్స్‌లో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News