Monday, January 20, 2025

విశ్వవిజేత స్పెయిన్

- Advertisement -
- Advertisement -

ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన విమెన్స్ జట్టు

సిడ్నీ : ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్‌లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో హోరాహోరీగా పోరాడి ఫైనల్ చేరిన తొలిసారే ఫుట్‌బాల్ విశ్వ విజేతగా నిలిచింది. తుదిపోరులో స్పెయిన్ జట్టు 1-0తో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి టైటిల్‌ను మద్దాడింది. కాగా, ఇరు జట్లకూ ఇదే తొలి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్. మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క గోల్ నమోదవగా స్పెయిన్ జట్టు సారధి స్ట్రైకర్ ఓల్గా కార్మోనా 29వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అనంతరం ఇంగ్లండ్ ఎంత ప్రయత్నించినా స్కోరు సమం చేయలేకపోయింది. ఇక రెండో అర్ధబాగంలో స్పెయిన్‌ను ఛేదించేందుకు ఇంగ్లండ్ స్ట్రైకర్లు తమదైన ఆటతీరుతో చెలరేగినా ఫలితం దక్కాలేదు. గతేడాది యూరోపియన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన స్పెయిన్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కాగా, ఈ విజయంతో, జర్మనీ తర్వాత పురుషుల, మహిళల వరల్డ్ కప్‌లను గెలుచుకున్న రెండో జట్టుగా స్పెయిన్ నిలిచింది.

Also Read: విరాట్‌కు వజ్రాల బ్యాట్….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News