Monday, December 23, 2024

ఫుట్‌బాల్ ప్రపంచకప్: సెమీ ఫైనల్లో అర్జెంటీనా..

- Advertisement -
- Advertisement -

దొహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో జరిగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-3 గోల్స్ తేడాతో గెలిచి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో క్రొయేషియాతో అర్జెంటీనా తలపడుతుంది. ఇక అర్జెంటీనానెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. తొలి హాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం చెలాయించింది. వరుస దాడులతో నెదర్లాండ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అర్జెంటీనా దూకుడైన ఆటను కనబరచడంతో నెదర్లాండ్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇదే క్రమంలో ఆట 35వ నిమిషంలో మొలినా అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి మెస్సీ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అయితే రెండో హాఫ్‌లో నెదర్లాండ్స్ పుంజుకుంది. వరుస దాడులతో అర్జెంటీనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే గోల్ మాత్రం సాధించలేక పోయింది. మరోవైపు 73వ నిమిషంలో కెప్టెన్ లియోనల్ మెస్సీ అర్జెంటీనాకు కళ్లు చెదిరే గోల్ అందించాడు. దీంతో అతని టీమ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అర్జెంటీనాకు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. అసాధారణ ఆటను కనబరిచిన నెదర్లాండ్స్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండో గోల్స్ సాధించడంతో స్కోరు 2-2తో సమమైంది. దీంతో ఫలితం కోసం ఎక్స్‌ట్రా టైమ్‌ను కేటాయించారు. ఇందులో ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పెనాల్టీ షూటౌట్‌లు తప్పలేదు. ఇందులో పైచేయి సాధించి అర్జెంటీనా మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News