దొహా(ఖతర్): ఇక్కడ జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. సోమవారం ఖలిఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-2 గోల్స్ తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ప్రథమార్ధంలో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఇటు ఇరాన్ అటు ఇంగ్లండ్ వరుస దాడులతో ఆకట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తొలి అర్ధ గంటలో ఇరు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు.
అయితే 35వ నిమిషంలో ఇగ్లండ్ యువ సంచలనం జూడ్ బెల్లింగ్‌హామ్ జట్టుకు నిరీక్షణకు తెరదించుతూ జట్టుకు తొలి గోల్‌ను సాధించి పెట్టాడు. అద్భుత ఆటను కనబరిచిన బెల్లింగ్‌హామ్ కళ్లు చెదరే గోల్‌ను సాధించాడు. ఆ వెంటనే బుకాయో సాకా ఇంగ్లండ్‌కు రెండో గోల్ అందించాడు. 43వ నిమిషంలో సాకా ఈ గోల్ నమోదు చేశాడు. ఇక ప్రథమార్ధం చివరి నిమిషంలో రహీం స్టెర్టింగ్ ఇంగ్లండ్‌కు మరో గోల్ అందించాడు.
దీంతో తొలి హాఫ్‌లో ఇంగ్లండ్ 30 ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితియార్ధం 62వ నిమిషంలో సాకా తన రెండో గోల్‌ను సాధించాడు. 71వ నిమిషంలో మార్కొస్ రష్‌ఫోర్డ్, 89వ నిమిషంలో జాక్ గియాలిష్ చెరో గోల్ చేశారు. ఇక ఇరాన్ తరఫున మెహదీ తరెమి రెండు గోల్స్ చేశాడు. 65వ నిమిషంలో తొలి గోల్ చేసిన మెహదీ చివరి నిమిషంలో రెండో గోల్ సాధించాడు.
FIFA World Cup 2022: England beat Iran by 6-2