Wednesday, January 22, 2025

ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ సమరం.. బ్రెజిల్‌తో క్రొయేషియా ఢీ

- Advertisement -
- Advertisement -

దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు శుక్రవారం తెరలేవనుంది. శుక్రవారం రాత్రి జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాతో ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ అమీతుమీ తేల్చుకోనుంది. కొరియాతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 41 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన బ్రెజిల్ ఈ మ్యాచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు క్రొయేషియా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.

అయితే కిందటి మ్యాచ్‌లో జపాన్‌పై అతికష్టం మీద గెలిచిన క్రొయేషియాకు బ్రెజిల్‌తో పోరు అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. ఇక శనివారం తెల్లవారు ఝామున జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో అర్జెంటీనా తలపడనుంది. అమెరికాపై నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాపై అర్జెంటీనాలు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. ఈ మ్యాచ్‌లో కూడా విజయమే లక్షంగా పెట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News