Wednesday, January 22, 2025

ఫుట్‌బాల్ ప్రపంచకప్: మొరాకోతో ఫ్రాన్స్ సెమీస్ పోరు..

- Advertisement -
- Advertisement -

దొహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ రెండో సెమీ ఫైనల్ సమరానికి డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. గురువారం తెల్లవారు ఝామున జరిగే సెమీస్‌లో మొరాకోతో ఫ్రాన్స్ తలపడనుంది. ఇక మొరాకో ఏ మాత్రం అంచనాలు లేకుండానే ప్రపంచకప్ బరిలోకి దిగి ఏకంగా సెమీస్‌కు చేరి పెను ప్రకంపనలు సృష్టించింది.

సెమీస్‌కు చేరే క్రమంలో పలు సంచలన విజయాలను మొరాకో సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌ను, క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ను మొరాకో మట్టి కరిపించింది. ఇక సెమీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక ఫ్రాన్స్ కూడా అసాధారణ ఆటతో సెమీస్‌కు చేరుకుంది. పోలండ్, ఇంగ్లండ్ వంటి టైటిల్ ఫేవరెట్ జట్లను ఫ్రాన్స్ ఓడించింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఫ్రాన్స్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News