Monday, January 20, 2025

పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాటు పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అగుచున్న సందర్భంలో వచ్చిన ఈ వేడుకలను ఆగస్టు 15 నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలిస్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల పై అవగాహన కలిగించే విధంగా స్టాల్స్‌లో ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

స్టాల్స్ పర్యవేక్షణ బాధ్యతలు వనపర్తి ఆర్డిఓకు అప్పగించారు. జిల్లాలో జరిగిన అభివృద్ది పనులపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని డిపిఆర్‌ఓ ఈ డిస్టిక్ మేనేజర్‌లను ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత జిల్లా విద్యాధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఒక కమిటీగా వ్యవహరించి పర్యవేక్షించాలని, కళాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని బాధ్యతలు అప్పగించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఎస్. తిరుపతిరావు, ఆర్డిఓ పద్మావతి, డిఎస్పి ఆనంద్‌రెడ్డితో పాటు డిఆర్డిఓ, డిపిఓ, వ్యవసాయ శాఖ ,ఫైర్ స్టేషన్, సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News