Monday, January 20, 2025

107 మందితో బిజెపి ఐదో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో 17 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన హైకమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్ ః భారతీయ జనతా పార్టీ ఐదో జాబితా విడుదల చేసింది. 107 మంది కూడిన జాబితా విడుదల చేయగా అందులో తెలంగాణకు సంబంధించిన రెండు స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్‌కు అరూరి రమేష్, ఖమ్మం స్ధానానికి తాండ్ర వినోద్‌రావును ప్రకటించింది. దీంతో తెలంగాణలో 17 సీట్లకు ఎంపి అభ్యర్థుల ఎంపిక పూర్తియింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన అరకు స్థానానికి కొత్తపల్లి గీత, అనకాపల్లి సిఎం రమేష్, రాజమండ్రి డి. పురంద్రేశ్వరి, నర్సాపూర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి స్ధానానికి వరప్రసాద్, రాజంపేట ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డిని ప్రకటించింది.

కాగా ఇటు అభ్యర్థుల వివరాలను విషయానికి వస్తే.. ఖమ్మం తాండ్ర వినోద్‌రావు ప్రజా సేవకు , ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు. వీరి స్వగ్రామం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. వినోద్‌రావు గత దశాబ్ధానికి పైగా సోషల్ వర్కర్‌గా పలు స్వచ్చంద సంస్థలలో ఉన్నత బాధ్యతలు సమర్ధంగా నిర్వహించి పేదలకు సేవ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News