Friday, November 22, 2024

రేపు యూపీ ఎన్నికల ఐదోదశ పోలింగ్

- Advertisement -
- Advertisement -
Fifth phase of UP polls tomorrow
61 స్థానాల నుంచి 692 మంది పోటీ

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ఈ దశలో12 జిల్లాలకు సంబంధించి 61 స్థానాలకు 692 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈదశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్ ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగుతుందని, ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్‌కుమార్ శుక్లా శనివారం చెప్పారు. సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశాంబీ,ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రెచ్, స్రవస్తి, గోండా జిల్లాలతోపాటు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన అమేథీ, రాయ్‌బరేలీ , రామమందిర నిర్మాణ ఉద్యమ కేంద్రం అయోధ్య నుంచి దాదాపు 2.24 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని తెలిపారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి ప్రముఖులు ఈ ఐదోదశ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సిరాతు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇతర మంత్రులు సిద్ధార్ధ్ నాధ్ సింగ్ (అలహాబాద్ వెస్ట్), రాజేంద్రసింగ్ అలియాస్ మోతీసింగ్ (ప్రతాప్‌ఘడ్), నందగోపాల్ గుస్తా (అలహాబాద్ సౌత్), రమాపతి శాస్త్రి (మంకాపూర్), కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ నేత కృష్ణా పటేల్, అప్నాదళ్ కే తరఫున ఇప్పటి పోరులో నిలిచారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధనామిశ్రా ప్రతాప్‌ఘడ్ జిల్లా రాంపూర్ ఖాస్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కుండా అసెంబ్లీస్థానం ఎమ్‌ఎల్‌ఎగా 1993 నుంచి పదవిలో ఉంటున్న రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యా తన పార్టీ జనతాదళ్ నుంచి పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News