Tuesday, November 19, 2024

జి20 సమ్మిట్‌… ఆకలిపై పోరుకు ప్రపంచ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

జి20 సమ్మిట్‌లో విస్తృత డిక్లరేషన్
నిర్దుష్ట అంశాల ప్రస్తావన లేదు
ఒక సభ్య దేశం పూర్తిగా ఆమోదించలేదు
ఆకలిపై పోరుకు ప్రపంచ ఒప్పందం
అత్యంత సంపన్నులపై పన్ను విధింపు
రియో డి జనీరో : రియో డి జనీరోలో జి20 ప్రముఖ ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు సోమవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్‌ను వెలువరించింది. అయితే, దానిని ఒక సభ్య దేశం పూర్తిగా ఆమోదించలేదు. ప్రస్తుతం సాగుతున్న ప్రధాన యుద్ధాలు, ఆకలిపై పోరుకు ప్రపంచ ఒప్పందం, ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై పన్ను విధింపు, ప్రపంచ పాలనకు మార్పులు వంటి బ్రెజిల్ ప్రాథమ్యంగా సూచించిన చాలా సమస్యల పరిష్కారానికి అది ప్రయత్నించింది.యుఎస్ అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం గురించిన అనిశ్చితి ఉక్రెయిన్, మధ్య ప్రాచ్యంలో యుద్ధాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతునన ఉద్రిక్తతలు దృష్టా ఒప్పందానికి రావలసిందిగా సదస్సులో సమీకృతమైన నేతలకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయి ఇనాషియో లూలా డ సిల్వా నచ్చజెప్పగలరా అని నిపుణులు సందేహించారు.

ఏకాభిప్రాయ సాధన అవకాశాలను మరింత కుదిస్తూ అర్జెంటైనా సంప్రదింపుల నేతలు ముసాయిదా భాషను కొంత వరకు సవాల్ చేశారు. వారు చివరకు పూర్తి డిక్లరేషన్‌ను ఆమోదించలేకపోయారు. ‘అది సాధారణమైనదైనా బ్రెజిల్‌కు సకారాత్మక ఆశ్చర్యకరం’ అని స్వతంత్ర రాజకీయ కన్సల్టెంట్, బ్రెజిల్ మాజీ మంత్రి థామస్ ట్రౌమన్ అన్నారు. ‘అసలు డిక్లరేషన్ ఉండకపోయే ప్రమాదం ఒకసారి కనిపించింది. హెచ్చరికలు ఉన్నప్పటికీ లూలాకు అది మంచి ఫలితమే’ అని ట్రౌమన్ పేర్కొన్నారు. యుద్ధాలను గర్హించారు, శాంతికి పిలుపు ఇచ్చారు, కానీ నిరుడు జి20 సమ్మిట్ ముగిసిన ఒక నెల తరువాత 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై తీవ్రవాద బృందం హమాస్ దాడిపై నిందారోపణలు లేవు.

అందువల్ల ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇజ్రాయెల్ ప్రచారాన్ని ఈ ఏడాది ప్రకట ఏవిధంగా పరిహరిస్తుందో స్పష్టత లేదు. ఇజ్రాయెల్ గాజాలో 43 వేల మందికి పైగా పాలస్తీనియన్లను హతమార్చిందని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేయగా, లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడుల్లో 3500 మందికిపైగా హతులైనారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. జి20 డిక్లరేషన్ ‘గాజాలో విధ్వంసకరమైన మానవతావాద పరిస్థితి, లెబనాన్‌లో ముదురుతున్న పోరు’ గురించి ప్రస్తావించి, మానవతావాద సహాయాన్ని పెంచవలసిన, పౌరుల రక్షణకు బలగాలను మోహరించవలసిన తక్షణావసరాన్ని గురించి నొక్కిచెప్పింది. ‘పాలస్తీనా స్వయంనిర్ణయాధికార హక్కును ధ్రువీకరిస్తూ మేము ఇజ్రాయెల్, పాలస్తీనా దేశం ప్రశాంత పరిస్థితుల్లో పక్కపక్కనే నివసించే రెండు దేశాల పరిష్కార లక్షానికి తిరుగులేని మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం’ అని డిక్లరేషన్ తెలిపింది.

అయితే, ఇజ్రాయెల్ కష్టనష్టాల గురించి గాని, హమాస్ చెరలో ఇప్పటికీ ఉన్న సుమారు 100 మంది బందీల గురించి గాని దానిలో ప్రస్తావన లేదు. ఇజ్రాయెల్ జి20 సభ్య దేశం కాదన్నది ఈ సందర్భంగా గమనార్హం. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కును యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పదే పదే సమర్థిస్తుండడానికి విరుద్ధంగా ఆ డిక్లరేషన్ సాగింది. రష్యాలో మరింత లోతట్టు ప్రాంతాల్లో దాడికి ఉక్రెయిన్‌ను అనుమతించే దీర్ఘ శ్రేణి యుఎస్ క్షిపణుల వినియోగంపై ఆంక్షలను సదలించాలన్న బైడెన్ నిర్ణయం మరొక పక్క వేధిస్తున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జి20 సమ్మిట్‌కు గైర్‌హాజరైన అత్యంత ప్రముఖ నేత. అంతర్జాతీయ నేర న్యాయస్థానం జారీ చేసిన ఒక వారంట్ ఆయనను అరెస్టు చేయడాన్ని సభ్య దేశాలకు తప్పనిసరి చేస్తున్నది.

ఆయనకు బదులు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్రోవ్ సదస్సుకు హాజరయ్యారు. జి20 డిక్లరేషన్ రష్యా పేరు ప్రస్తావించకుండా శాంతికి పిలుపు ఇస్తూ ఉక్రెయిన్‌లో ప్రజల కష్టాలను ఎత్తిచూపింది. కాగా, జి20 సమ్మిట్‌కు ముందు వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో మంత్రులు, సంప్రదింపుల నేతలు కోటీశ్వరుల ఆదాయాలపై రెండు శాతం పన్ను విధించాలన్న బ్రెజిల్ ప్రతిపాదనను చర్చించారు. నేతల మధ్యాహ్న సమావేశం ప్రారంభంలో లూలా ఆ పన్ను కోసం తిరిగి పిలుపు ఇచ్చారు. ఆ అంశం తుది డిక్లరేషన్‌లో చోటు చేసుకున్నది. కానీ ఆ పని ఎలా చేస్తారనే సందేహం మాత్రం ఉన్నది. అర్జెంటైనా సంప్రదింపుల నేతలు జూలైలో ఆమోదించిన ఆ క్లాజ్‌ను ఇప్పుడు కరాఖండిగా వ్యతిరేకించారని బ్రెజిల్ నుంచి అధికారి ఒకరు, మరొక జి20 దేశం నుంచి ఒకరు చెప్పారు. తుదకు అర్జెంటైనా జి20 డిక్లరేషన్‌పై సంతకం చేసింది. కానీ కొన్ని అంశాలపై పాక్షికంగా అసమ్మతి వ్యక్తం చేసింది. కాగా, డిక్లరేషన్‌లో ఎక్కువ భాగం లూలాకు అత్యంత ప్రధానమైన ఆకలి బాధను నిర్మూలించడంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఐక్యరాజ్య సమితి (యుఎన్) భద్రతా మండలి ‘పరివర్తన సంస్కరణ’ కోసం పాటుపడతామని నేతలు ప్రతిజ్ఞ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News