Wednesday, January 29, 2025

వేములలో టెన్షన్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

పాదయాత్రలో బిజెపి, టిఆర్ఎస్
పరస్పర దాడులు
ఇరువర్గాల కార్లు ధ్వంసం
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నా లీడర్లు


మన తెలంగాణ ప్రతినిధి గద్వాల:  ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రలో ఒక్కసారిగా సోమవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఇరువర్గాలకు చెందిన వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోగానే స్కూల్ దగ్గర రైతులు, టిఆర్ఎస్ కార్యకర్తలు  అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన బిజెపి లీడర్లు రైతులపై దాడి చేశారు. ఆ తర్వాత పాదయాత్ర ముందుకు సాగుతుండగా వెనుక నుంచి మరికొందరు రైతులు వచ్చి కార్లను ధ్వంసం చేశారు. రైతులు, బిజెపి కార్యకర్తల మధ్య తొపులాట జరిగింది. పోలీసులు చేరుకొని ఎక్కడికక్కడే ఇరువర్గాలను తరిమికొట్టారు.

అసత్యాలు చెబితే సహించేది లేదు

అలంపూర్ నియోజకవర్గంలో తిరుగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై అసత్యాలు ప్రచారం చేస్తే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హెచ్చరించారు. శాంతియుత పాదయాత్ర అంటూ దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వేముల గ్రామంలో అత్యవసర ధరలు గ్యాస్ ధరలు తగ్గించాలని మహిళలు యువకులు వచ్చి అడిగితే కత్తులతో, కట్టెలతో దాడులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన అబద్దాలు చెప్పడం మానుకోవాలని లేదంటే ఎక్కడికక్కడ మా కార్యకర్తలు నిలదీస్తారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News