Sunday, December 22, 2024

నారాయణపేట సెగ్మెంట్‌లో నువ్వా.. నేనా..?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ

మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట నియోజకవర్గంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా.. నేనా… అనే రీతిలో రసవత్తరమైన పోటీ నెలకొంది. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధితో పాటు వివిధ మండలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గంలో జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ తదితర అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తున్నారు. మళ్లీ అవకాశం ఇస్తే జిల్లా కేంద్రానికి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఓటర్లకు వివరిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి కూతురు చిట్టెం ఫర్ణికారెడ్డికి మద్దతుగా కుంభం శివకుమార్‌రెడ్డి ఇద్దరు కలిసి గ్రామ గ్రామాల్లో ప్రచారాన్ని హో రెత్తిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన శివకుమార్‌రెడ్డికి టికెట్ దక్కపోవడం పట్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన భుజష్కందాలపై వేసుకొని తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతి గ్రామంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రసవత్తరమైన పోటీ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News