లక్నో: లక్నో సూపర్‌జెయింట్స్‌రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, గౌతం గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన వివాదం ఐపిఎల్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్నోబెంగళూరు మ్యాచ్ సందర్భంగా బెంగళూరు బౌలర్ సిరాజ్ వేసిన ఓ బంతి లక్నో బ్యాటర్ నవీన్ ప్యాడ్లకు తాకింది. ఈ క్రమంలో బంతిని అందుకున్న సిరాజ్ ప్రత్యర్థి ఆటగాడు నవీన్ వైపు చూస్తూ దాన్ని స్టంప్స్‌పైకి విసిరాడు. అప్పటికీ నవీన్ క్రీజులోనే ఉన్నాడు. దీంతో సిరాజ్ చర్యలపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ నవీన్ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో వీరి మధ్యలోకి కోహ్లి వచ్చి చేరాడు. మరోవైపు రెండో ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా వచ్చి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు.
అయితే..కోహ్లి మాత్రం మిశ్రా మాటలను పట్టించుకోకుండా ఏదో చెప్పాడు. ఆ తర్వాత కోహ్లి గురించి నవీన్ ఏదో అంటుండగా అంపైర్ మధ్యలో కలుగ జేసుకున్నాడు. ఇక నవీన్ తీరుపై విసుగెత్తి పోయిన కోహ్లి అంపైర్‌కు తన ఉద్దేశాన్ని వివరించినట్టి తెలుస్తోంది. కాగా కోహ్లి తన షూను చూపిస్తూ నవీన్‌పై ఏదో సంజ్ఞలు చేసినట్టు కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. కోహ్లి చర్య వివాదం మరింత పెరిగేలా చేసింది. ఈ ఘటన మ్యాచ్ అనంతరం విరాట్‌గంభీర్‌ల మధ్య వాగ్వాదానికి కారణమంటూ జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
మరోవైపు ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల కరచాలనం సమయంలోనూ కోహ్లినవీన్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. లక్నో ఆటగాడు కైల్ మేయర్స్‌తో కోహ్లి ఏదో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన లక్నో మెంటార్ గంభీర్ మేయర్స్ పక్కకు తీసుకెళ్లాడు. అదే సమయంలో నవీన్ రావడంతో మరోసారి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కోహ్లిగంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా..రెండు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వీరిని విడదీశారు. తర్వాత లక్నో కెప్టెన్ రాహుల్ వచ్చి కోహ్లితో కొంత సేపు మాట్లాడాడు. కాగా, గంభీర్‌కోహ్లిల మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐపిఎల్ క్రమశిక్షణ కమిటీ గంభీర్‌కోహ్లిలకు భారీ జరిమానా సయితం విధించింది.
Also Read: ‘ది కేరళ స్టోరీ’పై ఎందుకింత రచ్చ?.. సుప్రీంకు చేరిన సినిమా వివాదం