Thursday, January 16, 2025

సిపిఎస్ రద్దుపై అలుపెరుగని పోరాటం చేస్తాం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిపిఎస్ రద్దు ఆయ్యే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లొయ్స్ అసోసియేషన్ తెలంగాణా రాష్ట్రం(సీపీఎస్టీఈఏటీఎస్) భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా తొంభై లక్షల ఉద్యోగులు కొత్త పింఛను పథకం లో ఉన్నారని చెప్పారు. ఉద్యోగ,ఉపాధ్యాయ శ్రేణులకు, సిపిఎస్ టెన్షన్ స్కీమ్ గా పరిణమించిందన్నారు. దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరించాలని కోరుతూ..చేసిన ఉద్యమాల ఫలితంగా దేశం లోని పలు రాష్ట్రాలు సహా ఆంధ్ర ప్రదేశ్ లో సైతం గ్యారంటి పెన్షన్ స్కీమ్ అమలు కు పాలకులు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

భాగస్వామ్య పింఛను పథకం రద్దు కోసం పాలకులను ఒప్పించేలా..కార్యాచరణ ప్రణాళికను, శనివారం నాడు హైదరాబాద్ లో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో రూపొందించడం జరుగుతోందని చెప్పారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ విచ్చేస్తున్నట్లు తెలిపారు.సిపిఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణులు ఏక తాటి పైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగం అంటేనే భద్రత అని,సిపిఎస్ లో జమ అవుతున్న డబ్బులు షేర్ మార్కెట్ లాభ నష్టాల పై ఆధారపడి ఉండటం వల్ల ఉద్యోగికి టెన్షన్ తప్ప మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2004 సెప్టెంబర్ నుంచి కొత్త పింఛను పథకం అమలు లో కి వచ్చిందని వివరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News