Thursday, January 23, 2025

హక్కులు, స్వేచ్ఛ కోసం…

- Advertisement -
- Advertisement -

Fight For rights and freedom
కె.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయమవుతోన్న చిత్రం సైదులు. రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. 1980లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన కథ ఇది. ఒక కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకుడు చంద్ర మహేష్, దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబా పి.ఆర్ మాట్లాడుతూ “సైదులు చిత్రం తెలంగాణలో జరిగిన ఒక కథ. ఈ కథను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించడం జరిగింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మరబత్తుల బ్రహ్మానందం, హీరోయిన్ ముస్కాన్ అరోరా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News