Tuesday, November 5, 2024

తగ్గేదేలే

- Advertisement -
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరులో

20న రాష్ట్రవ్యాప్త నిరసన

రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు
చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు
సైలెంట్‌గా ఉండాలి. కేంద్రంతో
అమీతుమీ తేల్చుకోవాలి.

యథావిధిగా రైతుబంధు

రాష్ట్రమంతటా దళితబంధు

మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి

నియోజకవర్గాల్లో కొందరు ఎంఎల్‌ఎలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఏం మాట్లాడకపోతే మీకే నష్టం .. యాక్టివ్‌గా ఉండండి.

నేడు ఢిల్లీకి మంత్రుల
బృందం మరోసారి
కేంద్రమంత్రితో భేటీ
మరింత ఉధృతంగా
ఉద్యమించాలి వచ్చే
ఎన్నికల్లో ఎంఎల్‌ఎలను
మళ్లీ గెలిపించుకునే
బాధత నాదే ఇక
మౌనం వీడండి పార్టీ
విస్తృత సమావేశంలో
ముఖ్యమంత్రి కెసిఆర్

యాసంగి పంటల సాగుపై
సిఎం దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి నష్టం చేస్తున్న కేంద్రంతో అమీ తుమీ తేల్చు కోవాలని సిఎం కెసిఆర్ నిర్ణ యించారు. రాష్ట్ర రైతాంగ సమ స్యలను పట్టించుకోని కేంద్రంపై ఆయన మరోసారి యుద్ధం ప్ర కటించారు. ధాన్యం కొనుగోళ్లపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ని రసన కార్యక్రమాల్లో భాగంగా బిజెపి, కేంద్రం దిష్టిబొమ్మలను దగ్ధ్దం చేయాలన్నారు. తెలంగా ణ భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్య క్షతన టిఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 300కు పైగా కీలక నేతలు పాల్గొన్నారు. అన్ని స్థాయిల గులాబీ శ్రేణులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో యాసంగి పంటల మార్పిడి, బిజెపి ద్వంద్వ విధానాలు, దళితబంధు కార్యక్రమాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులకు శిక్షణతో నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, టిఆర్‌ఎస్‌పై బిజెపి, కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారం తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిపై సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో నిరసనలు తెలపాలని ఎంఎల్‌ఎలకు సూచించారు. నేడు ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లనుండగా కేంద్ర మంత్రిని కలిసి మరోసారి ధాన్యం కొనుగోళ్లపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేయనున్నారని తెలిపారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్యపర్చండన్నారు. రైతుబంధు యధావిధిగా ఇస్తామని స్పష్టం చేశారు. నాయకులకు ఓపిక ఉండాలే..పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయి. కోటిరెడ్డి ఓపిక పట్టిండు.. ఇయ్యాల ఎంఎల్‌సి అయ్యిండు. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. దళితబంధుపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలని, ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని స్పష్టపర్చారు. మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని, కష్టపడి పనిచేయాలని ఎంఎల్‌ఎలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదేనని తెలిపారు.

ఇక సైలెంట్‌గా ఉండొద్దు..

రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు సైలెంట్‌గా ఉండాలి. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలి. నియోజకవర్గాల్లో కొందరు ఎంఎల్‌ఎలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఏం మాట్లాడకపోతే మీకే నష్టం.. యాక్టివ్‌గా ఉండండి. మంత్రులు జిల్లాల్లో ఎంఎల్‌ఎ, ఎంపి, ఎంఎల్‌సిలు అందరినీ కలుపుకుని పోవాలని సిఎం కెసిఆర్ సూచించారు.

‘మరింత ఉద్ధృతంగా ఉద్యమించాలి’

కాగా, ధాన్యం కొనుగోళ్లపై మోడీ సర్కార్ తీరుకు నిరసనగా ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయడంతో పాటు ఇందిరాపార్కు వద్ద ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ టిఆర్‌ఎస్ ఎంపీలు నిరసన గళం విప్పారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ ప్రధానికి కెసిఆర్ లేఖ రాశారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన కెసిఆర్.. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బిజెపి తీరుపై మరింత ఉద్ధృతంగా ఉద్యమించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, శనివారం మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 19 నుంచి సిఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగ ప్రజల్లోకి తీసుకెళ్లడం శ్రేణుల్లో స్తబ్ధత తొలగించి ఉత్సాహాన్ని నింపే ద్విముఖ వ్యూహంతో కెసిఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News