Monday, December 23, 2024

ఎయిర్‌షోలో ఢీకొన్న యుద్ధ విమానాలు: ఆరుగురి మృతి (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

యునైటెడ్ స్టేట్స్: అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఎయిర్ షోలో రెండు విమానాలు గాల్లో ఢీకొన్నాయి. వెంటనే నేలపై పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండు విమానాల్లోని పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) పేర్కొంది.

రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బోయింగ్‌ బీ-17 బాంబర్‌ విమానం గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తోంది. ఇంతలో బెల్‌ పి-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు క్షణాల్లోనే కుప్పకూలిపోయి మంటలంటుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News