Thursday, January 23, 2025

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సిఐలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇద్దరు సిఐలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రేమ్ కుమార్ అనే సిఐ ఎసిబిలో సేవలందిస్తున్నారు. సిఐ రాజుల నాయుడు విఆర్ లో ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలు జివిఎంసి ఆరో వార్డు షిప్ యార్డు కాలనీలోని శ్రీనిలయం ఆపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారు. పార్కింగ్ విషయంలో ఇద్దరు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పార్కింగ్ విషయంలో సోమవారం ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు సిఐలు దాడి చేసుకున్న స్వలంగా గాయపడడంతో ప్రేమ్ కుమార్ 100కు డయల్ చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News