Monday, December 23, 2024

హాకీ ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

FIH Men'S Hockey World Cup 2023 Schedule Released

స్పెయిన్‌తో భారత్ తొలి పోరు
హాకీ ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు
భువనేశ్వర్: భారత్ వేదికగా వచ్చే ఏడాది జనవరిలో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఆతిథ్య భారత్ తన తొలి మ్యాచ్‌ను జనవరి 13న స్పెయిన్‌తో ఆడనుంది. రూర్కేలాలోని బిస్రా ముండా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక భారత్‌తో పాటు ఇంగ్లండ్, వేల్స్ పూల్‌డిలో చోటు సంపాదించాయి. భారత్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా రూర్కేలాలోనే జరగుతుంది.

ఇక, భువనేశ్వర్‌లో భారత్ తన మూడో మ్యాచ్‌ను వేల్స్‌తో ఆడుతుంది. హాకీ ప్రపంకప్‌లో మొత్తం 44 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫైనల్ పోరు జనవరి 27న భువనేశ్వర్‌లో జరుగుతుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, మలేసియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బెల్జియం, కొరియా తదితర జట్లు పాల్గొంటున్నాయి.

 

FIH Men’S Hockey World Cup 2023 Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News