Monday, December 23, 2024

ప్రధాని మోడీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనదేశ ప్రధాని మోడీకి పపువా న్యూగినియా, ఫిజీ నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. ప్రస్తుతం పసిఫిక్ దేశమైన పపువా న్యూగినియా పర్యటనలో ప్రధాని ఉన్నారు. ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్‌షిప్‌కు గుర్తుగా “ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ పిజీ”ని ఇచ్చి సత్కరించారు. పపువా న్యూగినియాలో పర్యటించిన ప్రధాని మోడీ సోమవారం ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ మూడో సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫిజీ ప్రధాని సిటివేని రెబుకా నుంచి ప్రధాని మోడీ ఈ పతకాన్ని అందుకున్నారు. ఫిజీయేతరులైన అతికొద్ది మంది మాత్రమే ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకోగలిగారు. గతంలో పలు దేశాలు మోడీకి అత్యున్నత పురస్కారాలను అందించాయి. మోడీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాబల్యం పెరుగుతుండడమే కాక, ఇతర దేశాలతో సంబంధాలు మెరుగవ్వడం తదితర విశిష్టతలకు గుర్తుగా ఈ గౌరవ పురస్కారాలు దక్కుతున్నాయి.

ఉభయ దేశాల మైత్రిలో కీలక పాత్ర పోషించిన భారత ప్రజలకు, ఫిజీ ఇండియన్ ప్రజలకు ఈ గౌరవాన్ని ప్రధాని మోడీ అంకితం చేశారని విదేశాంగ మంత్రిత్వశాఖ ట్విటర్‌లో తెలియజేసింది. పాపువా న్యూ గినియాలో ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ రబుకాను కలిశారు. భారత్, ఫిజీ దేశాల సంబంధాలు రానున్న సంవత్సరాల్లో మరింత పటిష్టం కాడానికి కలిసి పనిచేయడానికి తాము ఎదురు చూస్తున్నామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News