Monday, December 23, 2024

విద్యార్థులకు ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

నవీపేట్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు బోదకాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించి అనంతరం వారికి ఔషధాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దోమకాటుతో తలెత్తే వ్యాధులు, మరియు జాగ్రత్తల గురించి విద్యార్థులకు వైద్య బృందం వివరించింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిన్, వైద్య అధికారులు వెంకటేశ్వరరావు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ఉపాధ్యాయులు సంతోష్ ల్యాబ్ టెక్నీషియన్లు , ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News