Sunday, December 22, 2024

వేణుస్వామికి బిగ్ షాక్.. ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని కోర్టులో ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తి పిటిషన్ వేశారు. ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని, వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర చేస్తున్నారని ఆయన పిటిషన్ లో తెలిపారు. దీనిపై విచారించిన కోర్టు.. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, గత కొంతకాలంగా వేణుస్వామి చెప్పినదంతా రివర్స్ కావడంతో.. ప్రస్తుతం ఆయన జాతకం బాగా లేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే..ఆయన చెప్పేవన్నీ అబద్దాలంటూ టీవి5 మూర్తి.. కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. కాగా.. వేణుస్వామి చేత పలువురు స్టార్ హీరోయిన్లు ప్రత్యేక పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దాంతో ఈయన సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిపోయారు. కొన్ని రోజలు కాలం కలిసిరావడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News