Thursday, November 14, 2024

స్థానిక ఎంఎల్‌సి స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

- Advertisement -
- Advertisement -

Filed nominations of TRS candidates for local MLC positions

రంగారెడ్డి జిల్లా నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి,
ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎల్.రమణ, ఉమ్మడి వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తాత మధు నామినేషన్ల దాఖలు
నేటితో ముగియనున్న
నామినేషన్ల పర్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థాని క సంస్థల కోటా ఎంఎల్‌సి స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రంగా రెడ్డి జిల్లాలో రెండు ఎంఎల్‌సి స్థానాలకు టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులుగా శంభీపూర్ రాజు, ప ట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్లు సమర్పించా రు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, టిఆర్‌ఎస్ ఎం ఎల్‌ఎలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ తర ఫున ఎల్.రమణ నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా… ఆయన తరఫున మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్‌ఎ అరూరి రమేశ్‌తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను వేశారు. అనంతరం జెడ్‌పి చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు, ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్‌లు ఒక సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు.

ఖమ్మం స్థానిక స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధు తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు రాములునాయక్, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్‌కు నామపత్రాలు అందజేశారు. తొలుత టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్.. తాతామధుకు పార్టీ బీ.ఫారం అందజేశారు. అక్కడి నుంచి అంతా కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎంఎల్‌సి స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి,14న ఓట్లను లెక్కిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News