Monday, December 23, 2024

ఫైల్స్, రికార్డులు క్రమ పద్దతిలో ఉంచాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల : కార్యాలయంలో ఉన్న ఫైల్స్ ,రికార్డులు అన్ని కూడా క్రమ పద్దతిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సెక్షన్ సూపరిడింటెంట్‌లకు ఆదేశించారు. మంగళవారం నూతన ఐడిఓసి కార్యాలయంలో ఉన్న రికార్డ్ రూంని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఫైల్స్ , రికార్డ్ అన్ని కూడా క్రమ పద్దతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుభవం కలిగి ఉన్న వారిని పిలిపించి మండలం, గ్రామ పంచాయతీ వారిగా ఫైల్స్ , రికార్డ్ అన్నింటిని సంవత్సరం వారిగా ర్యాకులలో అమర్చాలన్నారు. ఏబిసి, హెచ్ సెక్షన్ల వారిగా ఉన్న ఫైల్స్ అన్ని కూడా సంవత్సరం వారిగా వరుస క్రమ పద్దతిలో ఉంచాలని అన్నారు. కలెక్టర్‌తో పాటు ఏఓ యాదగిరి,సూపరిడింటెంట్‌లు మదన్‌మోహన్, రాజు, ఎల్లయ్య, చైతన్య, మనోహర్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News