Sunday, September 8, 2024

బ్యాక్‌లాగ్ రిజర్డ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

బ్యాక్‌లాగ్ రిజర్వ్ ఖాళీలను గుర్తించేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలను ఆదేశించినట్లు కేంద్ర సిబ్బంది శౠఖ సమయా మత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. బ్యాకల్‌లాగ్ రిజర్వ్ ఖాళీలతోసహా అన్ని ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తెలిపారు. బ్యాక్‌లాగ్ రిజర్వ్ ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయి, లోపాలు ఏవైనా ఉంటే సరిచేయడం, ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేయడం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఓపెన్ కాంపిటీషన్‌లో దేశవ్యాప్త ప్రాతిపదికన జరిగే ప్రత్యక్ష నియామకాలలో షెడ్యూల్డు కులాలకు(ఎస్‌సి) 15 శాతం,

షెడ్యూల్డు తెగలకు(ఎస్‌టి) 7.5 శాతం, ఇతర వెనుకబడిన కులాలకు(ఓబిసి) 27 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రమోషన్ల విషయంలోను ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 7.5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీల భర్తీకి చేపడుతున్న చర్యల గురించి జవాబిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ జరుగుతోందని ఆయన చెప్పారు. 2022 అక్టోబర్ 22న ప్రధాని ప్రారంభించిన రోజ్‌గార్ మేళాలో ఖాళీల భర్తీ జరుగుతోందని ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 45-50 నగరాలలో కేంద్ర స్థాయిలో 12 రోజ్‌గార్ మేళాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News