కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని సా ంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో (బాలుర) ఇంటర్ అడ్మిషన్ కోసం ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ కెవి చలపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నకోడూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, కోహెడ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలోనే నడుస్తుందని తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపిసి, బిపిసి గ్రూపులలో ఖాళీల భర్తీకి ఎస్సి, ఎస్టి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి ఈనెల 21న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు. మెరిట్ ప్రాతిపదికన ప్రవేశం కల్పించడం జరుగుతుందని వివరించారు. కోహెడ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలకు సంబంధించి బిపిసిలో ఎస్సి (10), మైనార్టీ (02), బిసి (01), అలాగే చిన్నకోడూర్ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలకు సంబంధించి ఎంపిసిలో ఎస్సి (09), ఎస్‌టి (01), మైనార్టీ (02), బిపిసిలో ఎస్సిసి (1), ఎస్టి (02), బిసి (02), ఒసి (01) ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు కార్పోరేట్ స్థాయికి మించిన నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, వసతి, భోజనం, పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అందిస్తున్నట్లు తెలిపారు. పదోతరగతి పాస్ అయిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ కెవి చలపతి సూచించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఖాళీ సీట్ల భర్తీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -