Monday, December 23, 2024

బంజారా సంస్కృతిని చాటిచెప్పే చిత్రం

- Advertisement -
- Advertisement -

Film about culture of Banjara

హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్, రైనా -సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. బంజారా-, తెలుగు,- ఇంగ్లీష్-, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రీ -రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సుమన్, భానుచందర్, విజయ్ రంగరాజు, గీతాసింగ్, కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని పాల్గొన్నారు. ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, భూక్య భారతి, పీర్యా నాయక్, రమేష్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవాదాస్’ చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్, భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సేవాదాస్’ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను బెల్లయ్య నాయక్, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ప్రశంసించారు. నిర్మాతలు ఇస్లావత్ వినోద్, రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ ఈనెల 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు.

టాప్ బిట్ న్యూస్‌ః
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభం నుంచి అనేక క్రైమ్ డ్రామాస్‌లో కీలకపాత్రలు పోషించి మెప్పించింది. తాజాగా ఆమె గ్మాన్షు ధూలియా దర్శకత్వంలో ‘ద గ్రేట్ ఇండియన్ మర్డర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సందర్భంగా రిచా చద్దా మాట్లాడుతూ “మన చుట్టూ చాలా నేరాలు జరుగుతున్నాయి. అందువల్లే ప్రజలకు క్రైమ్ డ్రామాస్ ఎంతగానో నచ్చుతున్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News