Sunday, December 22, 2024

కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా

- Advertisement -
- Advertisement -

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి దర్శకత్వంలో చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. ఈ సిని మా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకు లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ “చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయని ఈ సినిమాలో చూపించారు. షరతులు వర్తిస్తాయి చిత్రం కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా. ఈ సినిమా మంచి విజ యం సాధించాలి”అని అన్నారు. దర్శకుడు కుమా ర స్వామి మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో తీసిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ, హీరో చైతన్య రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: ‘జపాన్’ తెలుగు హక్కులని సొంతం చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News