Sunday, December 22, 2024

వరదల్లో చిక్కుకున్న సినీ నటుడు నాగార్జున

- Advertisement -
- Advertisement -

అనంతపురం: కళ్యాణి జ్యూలర్స్ నగల దుకాణం ప్రారంభం కోసం అనంతపురం వెళ్లిన నటుడు నాగార్జున వరదల్లో చిక్కుకున్నారు. ఉదయం విమానంలో పుట్టపర్తి చేరుకున్న నాగార్జున అక్కడి నుంచి అనంతపురం వెళ్తుండగా వరదలో చిక్కుకున్నారు. దీంతో నిర్వాహకులు ఆయనను మరో మార్గంలో అనంతపురం తరలించారు. ఆ తర్వాత ఆయన నగల దుకాణాన్ని ప్రారంభించారు. నాగార్జునను చూసేందుకు వందలాదిమంది తరలివచ్చారు.

శ్రీసత్యసాయి జిల్లాలో గత రాత్రి(సోమవారం) నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దానికి అనుకుని అటూయిటూ ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. వరద ప్రభావం కారణంగా హైదరాబాద్-బెంగళూరు హైవేపై రాకపోకలు కూడా స్తంభించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News