Wednesday, January 22, 2025

చెలిమి తండాలో సందడి చేసిన సోనూసూద్

- Advertisement -
- Advertisement -

మద్దూరు:వెండి తెరపై ప్రతి నాయకుని పాత్రలు పోషించే సిని నటుడు సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం తాను రియల్ హీరోనని అనేక సార్లు నిరూపించుకున్నారు.కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో సోనూసూద్ చేసిన సేవలు వెలకట్టలేనివి. ఎందరికో ఆర్థిక సాయం చేసిన ఆయన దేశంలోని వేలాది మందిని కష్టాల నుంచి గట్టెక్కించారు. ఆయన సేవలను కొనియాడుతూ ధూళిమిట్ట మండలం దుబ్బతండా ఆమ్లెట్ విలేజ్ చెలిమే తండాలో తండావాసులు సినీ నటుడు సోనుసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలను నిర్వహించడం చేయడానికి గతంలోని తెలుసుకున్న సోనుసూద్ బుధవారం తండాకు విచ్చేసి ప్రజలతో విగ్రహాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనపై చూపిన అభిమానాన్ని వెలకట్టలేనిందని, రాజకీయాలు నాకు అవసరం లేదని ఇంతమంది అభిమానుల అభిమానం నాకు చాలని కొనియాడారు.

తన జీవితాంతం తండావాసులకు రుణపడి ఉంటాను అన్నారు.నేను దేవుని కాదు నేను మనిషిని అని, దుబ్బ తండావాసులు నాపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.తండావాసులు తన కుటుంబ సభ్యులుగా సోనూసూద్ పేర్కొన్నారు. జీవితాంతం అభిమానుల గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని అన్నారు.మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ… తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఎల్లవేళలా సేవలను అందిస్తానని అన్నారు.ఈ సందర్భంగా సోనూసూద్ తనపై రాసిన పాటల సిడిని ఆవిష్కరించారు.అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ తిరుగు ప్రయాణం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, సర్పంచ్ లకావత్ రేఖ శ్రీనివాస్, ఎంపిటిసి ఇస్లాత్ నముకు, హనుమతండా సర్పంచ్ రేణుక కాలారం, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News